హైదరాబాద్ డాక్టర్ కిడ్నాప్ – రక్షించిన అనంత పోలీసులు

By udayam on October 28th / 6:13 am IST

అనంతపురం: హైదరాబాద్ కిడ్నాపర్లకు అనంత పోలీసులు చెక్ పెట్టారు. డెంటిస్ట్ హుస్సేన్‌ను అనంతపురం జిల్లా పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో దంత వైద్యుడు హుస్సేన్ నిన్న సాయంత్రం కిడ్నాప్‌కు గురయ్యారు. హిమాయత్‌సాగర్‌ దర్గా వద్ద డాక్టర్ ) ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు.

రాజేంద్రనగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. కుటుంబ కలహాలు.. వ్యాపార లావాదేవీల కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.

మరోవైపు డాక్టర్ సెల్‌ఫోన్ కాల్ రికార్డింగ్‌ను దర్యాప్తు బృందం పరిశీలించింది. సిపి సజ్జనార్ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. అన్ని చెక్‌పోస్టులను అలర్ట్ చేయడంతో అనంతపురం జిల్లాలో కూడా అన్ని చెక్ పోస్టులను ఎస్పీ అలర్ట్ చేశారు.

అనంతపురం మీదుగా బెంగళూరుకు కిడ్నాప్ గ్యాంగ్‌ను గుర్తించిన అనంతపురం జిల్లా పోలీసులు డాక్టర్‌ హుసేన్‌ను రక్షించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. రాప్తాడు పోలీసుల అదుపులో కిడ్నాపర్లు ఉన్నారు.