గత నెల 28న బంజారాహిల్స్లో ఓ మైనర్ బాలికపై 4గురు అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపింది. రాజకీయ ప్రముఖుల పిల్లలకు ఈ నేరంతో సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించామన్న ఆయన.. వీరంతా మైనర్లేనని తెలిపారు. తెలంగాణ హోం మంత్రి మనువడికి ఈ కేసుతో సంబంధం లేదని ఎమ్మెల్యే కొడుకుపై ఆధారాలు లేవన్నారు.