హైదరాబాద్​: ఒకే అపార్ట్​మెంట్​లో 112 కేసులు

By udayam on April 14th / 1:19 pm IST

హైదరాబాద్​లోని మై జ్యూవెల్​ హోం గేటెడ్​ కమ్యూనిటీ కరోనా హాట్​స్పాట్​గా మారింది. మదీనాగూడ లోని ఈ అపార్ట్​మెంట్​లో నిన్న ఒక్కరోజే 11 కొత్త కేసులు బయటపడి మొత్తం కేసుల సంఖ్యను 112కు చేర్చాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్​ ఒక్క సిటీలోనే 406 కొత్త కేసులు నమోదయ్యాయి. జిహెచ్​ఎంసి, ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు చాలా మంది వారి వారి ఇళ్ళలోనే హోం క్వారంటైన్​ అయ్యారని, వైద్య చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించామని అపార్ట్​మెంట్​ ఓనర్స్​ అసోసియేషన్​ సెక్రటరీ నంద కిషోర్​ తెలిపారు.

ట్యాగ్స్​