కులాంతర వివాహం: అబ్బాయిని చంపేసిన అమ్మాయి సోదరులు

By udayam on May 5th / 8:56 am IST

కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో అమ్మాయి సోదరులు వరుడ్ని హత్య చేసిన ఘటన సరూర్​ నగర్​లో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఈ జంట బైక్​పై ప్రయాణిస్తుండగా.. అమ్మాయి సోదరులు బలమైన ఇనుప రాడ్​తో వరుడు బిల్లాపురం నాగరాజు తలపై మోదారు. దీంతో అతడు స్పాట్​ డెడ్​ అయ్యాడు. ఘనాపూర్​కు చెందిన సయ్యద్​ ఆశ్రిన్​ సుల్తానాను కాలేజీలోనే ప్రేమించిన నాగరాజు అనంతరం ఈ ఏడాది జనవరిలో ఆర్య సమాజ్​లో వివాహమాడాడు. దీనిపై అమ్మాయి బంధువులు తరచూ నాగరాజును బెదిరింపులకు గురి చేస్తున్నారు.

ట్యాగ్స్​