హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ ను చుట్టేస్తూ మెట్రో రైలు మార్గాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ సిఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ ఇదే అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించారు. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్నాయి. ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగై.. ఉపాధి అవకాశాలకు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి.