హైదరాబాద్: మెట్రో ఉద్యోగుల సమ్మె విరమణ

By udayam on January 3rd / 10:30 am IST

హైదరాబాద్ లో మెట్రో ఉద్యోగులు మంగళవారం ఉదయం ఆకస్మిక సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలంటూ టికెటింగ్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు టికెటింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని, తమ జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని మెట్రో ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో దిగొచ్చిన అధికారులు వారితో చర్చలు జరిపారు. మరోసారి చర్చలకు రావాలని యాజమాన్యం కోరిందని అప్పటి వరకూ విధులను నిర్వహిస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్​