4:23 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

పండుగలకు మెట్రో బంపరాఫర్ 2 weeks ago

హైదరాబాద్: లాక్ డౌన్ తర్వాత మెట్రో రైళ్లకు మోక్షం కల్పించిన సంగతి తెల్సిందే. ఇక దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని ‘సువర్ణ’ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు మెట్రో  వెల్లడించింది.  శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు మెట్రో ప్రయాణికులకు ఆఫర్ వర్తిస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు.

‘సువర్ణ’ ఆఫర్​ వివరాలు

7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే ఛాన్స్ ఉంటుంది. 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే , 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే ఛాన్సిస్తారు. అదే 20 ట్రిప్పులకు ఛార్జీ కడితే, 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరగొచ్చు. 30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లించిన పక్షంలో 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరగవచ్చు. 40 ట్రిప్పులకు ఛార్జీ కడితే, 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే ఛాన్స్ ఉంటుంది.

గర్భిణీ కోసం మెట్రో నడిచింది..

ప్రయాణికుల భద్రత విషయంలో మెట్రో ముందుంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షం పడ్డ రోజు గర్భిణి కోసం ప్రత్యేకంగా మెట్రో రైలు నడిపినట్లు తెలిపారు. విక్టోరియల్ స్టేషన్ నుంచి మియాపూర్‌ మెట్రో రైలు నడిపి ఆ మహిళను ఇంటికి పంపించినట్లు చెప్పారు. టీ సవారీ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి ఈ ఆఫర్ అమలు కానుంది.