హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల రూల్స్ ఇవే

By udayam on December 19th / 7:49 am IST

హైదరాబాద్​ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కొత్త రూల్స్​ ను తీసుకొచ్చారు సిటీ పోలీసులు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే 3 స్టార్‌, ఆ పైస్థాయి హోటల్స్‌, క్లబ్స్‌, పబ్స్‌ తప్పనిసరిగా పదిరోజుల ముందు అనుమతి తీసుకోవాలని తెలిపారు. బయట తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడంతోపాటు డ్రగ్స్‌, ఆయుధాలు ఎట్టి పరిస్థితుల్లోను లోపలికి అనుమతించొద్దని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్​