మంత్రి మల్లారెడ్డి ఫై ఐటి అధికారులు కేసు నమోదు చేసారు. అధికారులు తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆరోపించగా.. గురువారం తమపైనే మల్లారెడ్డి దాడి చేశారని ఐటీ అధికారులు ప్రతి ఆరోపణలు చేశారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మంత్రి తమపై దాడి చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు గుంజుకున్నారని ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా తాము సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. ల్యాప్ టాప్ తెచ్చి ఇచ్చినా ఐటీ సిబ్బంది దానిని తీసుకోలేదు. అది తమ ల్యాప్ టాప్ కాదని చెప్పడంతో దానిని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచినట్లు సమాచారం.