హైదరాబాద్ స్టార్టప్ డార్విన్ బాక్స్ ఈరోజు యూనికార్న్‌గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు జయేష్ రంజన్, రోహిత్, చైతన్య, జయంత్‌లు వెల్లడించారు. ఇటీవల 72 మిలియన్ డాలర్ల ఫండింగ్ సేకరించడం ద్వారా కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకుందని వారు తెలిపారు. దేశంలో 1 బిలియన్ డాలర్ దాటిన స్టార్టప్‌లను యూనికార్న్ స్టార్టప్‌లుగా పిలుస్తారు. 2015లో మొదలైన ఈ కంపెనీ 6 సంవత్సరాలకు ఈ స్థాయికి చేరుకుంది.