తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ రోడ్లపై కార్ల రేసింగ్ పండుగ వచ్చేసింది. ఈ నగరంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ‘ఫార్మిలా ఈ’ కార్ల రేసింగ్ నిర్వహించనున్నట్లు మహీంద్ర రేసింగ్ సీఈఓ దిల్బాగ్ గిల్ ప్రకటించారు. మొత్తం ఎలక్ట్రిక్ కార్లే పాల్గొనే ఈ–కార్ల రేసింగ్‌లో మహీంద్రా సంస్థ 2014 నుంచి పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈవీ వెహికల్ హబ్‌గా ఎదుగుతున్న క్రమంలో ఈ కార్ల రేస్ కూడా ఇక్కడ జరగడం మరిన్ని పెట్టుబడుల్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు.