హైదరాబాద్​: అవతార్​ –2 కోసం దేశంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్​ స్క్రీన్​

By udayam on November 23rd / 6:46 am IST

దేశంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్​ స్క్రీన్​ మన హైదరాబాద్​ లో సిద్ధమైంది. ప్రసాద్​ ఐమ్యాక్స్​ లో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఈ భారీ స్క్రీను సిద్ధం చేసి ఈనెల 25 నుంచి ఈ స్క్రీన్​ పై టెస్టింగ్​ జరపనున్నారు. ఇది భారత దేశంలో అతి పెద్ద సినిమా తెరగా రికార్డుకెక్కింది.కెనడాకు చెందిన ‘స్ట్రాంగ్ ఎండీఐ’ అనే ప్రొజెక్షన్ స్ర్కీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. సౌండ్ సిస్టమ్ ను కూడా అత్యుత్తమమైనది ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న అవ‌తార్ 2 విడుదల నాటికి ఈ తెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్​