హైదరాబాద్ పోలీసులు రాత్రిళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. మహమ్మారి సమయంలో కాస్త నెమ్మదించిన ఈ చెకింగ్స్ను తిరిగి పూర్తి స్థాయిలో రాత్రి మొత్తం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. జాయింట్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాల మేరకు రోడ్ యాక్సిడెంట్స్ను కంట్రోల్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా డ్రంక్ డ్రైవింగ్ చెకింగ్స్ నిర్వహించనున్నట్లు కోర్టుకు వెల్లడించారు.