మెట్రో స్టేషన్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద యువతి ఈ దారుణానికి పాల్పడింది. స్టేషన్ పైనుండి దూకడంతో యువతికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. కాగా యువతి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా పోలీసులు గుర్తించారు. ఆర్ధిక సమస్యలే యువతి ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.