నడిరోడ్డుపై మహిళపై హత్యాయత్నం

By udayam on May 28th / 4:23 am IST

హైదరాబాద్​లో నడిరోడ్డుపై ఒక మహిళపై హత్యాయత్నం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. కంచన్ బాగ్ ప్రాంతంలో ఒమర్ హోటెల్ దగ్గర రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో పలుమార్లు పొడిచారు. ఆ సమయంలో మహిళ దగ్గరగా ఉన్న వారు ఎవరూ అతడిని ఆపే సాహసం చేయలేకపోయారు. భర్త లేని ఈ మహిళను గతేడాది కాలంగా అతడు వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉండగా.. నిందితుడి కోసం గాలింపు జరుగుతోంది.

ట్యాగ్స్​