ఉద్ధవ్​ ఠాక్రే: రాజీనామాకు సిద్ధం

By udayam on June 22nd / 12:57 pm IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర సిఎం ఉద్దవ్​ ఠాక్రే తొలిసారిగా నోరు విప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనను సిఎం పదవి నుంచి దిగిపోమంటే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘కొంతమంది ఇది బాలాసాహెబ్​ శివసేన కాదని అంటున్నారు. కానీ ఇది పాత శివసేనే. బాలాసాహెబ్​ ఆశయాల కోసం పనిచేస్తున్న పార్టీనే ఇది. హిందుత్వమే మా జీవన విధానం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘కొద్ది రోజులుగా నేను వారిని కలవలేదన్నది నిజం. నాకు జరిగిన ఆపరేషన్లు, ఆరోగ్య పరిస్థితి రీత్యానే నేను ఒంటరిగా పనిచేస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​