బ్రాడ్​పిట్​: రిటైర్మెంట్​ కోసం ఆలోచిస్తున్నా

By udayam on June 23rd / 6:37 am IST

హాలీవుడ్​ సూపర్​స్టార్​ బ్రాడ్​ పిట్​ సంచలన ప్రకటన చేశాడు. ఇకపై తాను సినిమాల్లో నటించకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే తన చివరి సినిమాను మాత్రం పూర్తి చేస్తానని ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. గత 30 ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్​కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన నటుల్లో బ్రాడ్​పిట్​ ఒకడు. ఆస్కార్​ అవార్డును సైతం సొంతం చేసుకున్న ఈ 58 ఏళ్ళ నటుడు 1980 చివర్లో కెరీర్​ను ప్రారంభించాడు. అయితే 1991లో వచ్చిన తెల్మా & లూయిస్​ సినిమాతో పేరొచ్చింది.

ట్యాగ్స్​