రెహ్మాన్​ ఎవరో తెలియదు : బాలకృష్ణ

By udayam on July 22nd / 2:47 am IST

ఆస్కార్​ అవార్డ్​ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్​.రెహ్మాన్​ ఎవరో తనకు తెలియదంటూ నటుడు బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓ టివి ఛానల్​ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భారత రత్న అన్నా నాకు విలువ లేదు. మా నాన్నగారికి రాని అవార్డులకు నేనెందుకు విలువ ఇవ్వాలి. ఆ అవార్డులే మాకు రాలేదని బాధపడతాయి. మా కుటుంబం తెలుగు సినిమాకు చేసిన సేవలకు అవార్డులు సరిపోవు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎ.ఆర్​.రెహ్మాన్​ 1993లో వచ్చిన బాలకృష్ణ మూవీ ‘నిప్పు రవ్వ’కు సంగీతం అందించారు.

ట్యాగ్స్​