టెస్లా కొంటానని ఎప్పుడూ చెప్పలేదు : టిమ్​కుక్​

By udayam on April 6th / 10:59 am IST

ఎలన్​ మస్క్​కు సంబంధించిన టెస్లా కార్ల కంపెనీని కొనడానికి తాను ఎప్పుడూ అతడితో చర్చలు జరపలేదని యాపిల్​ సిఈఓ టిమ్​ కుక్​ అన్నారు. గతంలో తన కంపెనీని కొనడానికి యాపిల్​తో చర్చలు జరిపానని, అయితే తాను చెప్పిన ధరకు టిమ్​ ఒప్పుకోలేదని కొద్ది నెలల క్రితం ఎలన్​ మస్క్​ బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టిమ్​ స్పందిస్తూ.. అతడితో అలాంటి చర్చలేవీ తాము జరపలేదని, అయితే ప్రపంచంలోనే టెస్లా కార్లు అత్యుత్తమమైనవని కొనియాడారు.

ట్యాగ్స్​