ఎక్సెల్​ గ్రూప్​ పై ఐటీ సోదాలు

By udayam on January 4th / 7:08 am IST

హైదరాబాద్‌ నగరంలో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలో ఐటీ శాఖ కార్యాలయం నుంచి ఈ ఉదయమే పదుల సంఖ్యలో ఐటీ అధికారులు 40 కార్లు.. మూడు సీఆర్పీఎఫ్ వెహికిల్స్‌లో నిర్దేశిత ప్రాంతాలకు బయలుదేరారు. 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం లక్ష్యంగా సోదాలు చేస్తున్నట్టు సమాచారం. ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలు జరిగినట్టు గుర్తించడంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ట్యాగ్స్​