రెండు రోజుల పాటు ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై , ఆఫీస్ లపై సోదాలు చేసి దాదాపు రూ. 15 కోట్ల తో పాటు పెద్ద ఎత్తున బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల విషయంలో విద్యార్ధుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. మల్లారెడ్డికి చెందిన అన్ని రకాల కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూల్ చేసినట్లు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు. ఇక సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి అధికారులు నోటీసులిచ్చారు. సోమ, మంగళవారాల్లో (28,29 తేదీల్లో) విచారణను రావాలని నోటీసులు జారీ చేసారు.