చిరంజీవి: విశాఖలోనే సెటిల్​ అవుతా

By udayam on January 9th / 4:51 am IST

వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఇక్కడకు ఎపుడు వచ్చినా ఉద్వేగానికి లోనవుతానని విశాఖలో స్థిరపడాలనేది తన చిరకాల కోరిక అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్​ ఈవెంట్​ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ స్థలం కూడా కొన్నానని ఇక్కడే ఇల్లు కట్టుకుని వుండాలని అనిపిస్తుంది అన్నారు. అపుడు నేనుకూడా వైజాగ్ వాసిని అవుతానని అన్నారు.. ఇక్కడ ప్రశాంత వాతావరణం , ప్రజల మనసులో ఎటువంటి కల్మషం ఉండదని. అందరూ కలిసి మెలిసి ఉంటారని అన్నారు. అభిమాని అని కాకుండా, నిరంతరం కష్టపడే తత్వం ఉందనే బాబీకి అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​