119 ప్రయాణికులను రక్షించిన ఎయిర్​ ఫోర్స్​

By udayam on May 16th / 9:55 am IST

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షం ధాటికి వరదలో చిక్కుకున్న సిల్చార్​–గువాహతి ఎక్స్​ప్రెస్​లోని ప్రయాణికులను భారత వైమానిక దళం రక్షించింది. ఈ ట్రైన్​లో ప్రయాణిస్తున్న 119 మంది ప్రయాణికులను ప్రత్యేక హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వరల ధాటికి పట్టాలు సైతం కొట్టుకుపోవడంతో ట్రైన్​ కచర్​ వద్ద గంటల కొద్దీ నిలిచిపోయింది. దీంతో అధికారులు భారత ఆర్మీ సాయం కోరారు. సోమవారం నాడు కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుండడంతో పలు ట్రైన్ల సర్వీసులు రద్దయ్యాయి.

ట్యాగ్స్​