భారత గగనతలంలో ఇరాన్​ విమానానికి బాంబు బెదిరింపు

By udayam on October 3rd / 9:17 am IST

ఇరాన్‌లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళ్తున్న ఇరాన్​కు చెందిన విమానానికి భారత గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు రావడంతో విమానాన్ని న్యూఢిల్లీలో ల్యాండ్‌ చేసేందుకు అనుమతి కోరింది. జైపూర్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయాలని ఢిల్లీ ఏటీసీ సూచించింది. ఆ తర్వాత సమాచారం అందుకున్న భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఆ విమానాన్ని అనుసరించాయి. ఏటీసీ ఢిల్లీలో అనుమతించకపోవడంతో పైలట్‌ విమానాన్ని జైపూర్​ వైపు కాకుండా చైనా గగనతలం దిశగా మళ్లించారు. ప్రస్తుతం భద్రతా సంస్థలు విమానాన్ని పర్యవేక్షిస్తున్నాయి.

ట్యాగ్స్​