యుద్ధ విమానం నుంచి బ్రహ్మాస్​ పరీక్ష విజయవంతం

By udayam on December 30th / 5:22 am IST

భారత రక్షణ రంగ సామర్థ్యాన్నిపెంచే మరో కీలక ప్రయోగం విజయవంతమైంది. బ్రహ్మాస్​ సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌ను గురువారం సుఖోయ్​–30 ఎంకెఐ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి నిర్దేశిత దూరంలోని నౌకను పేల్చేసింది. భారత వాయుసేన సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి,బంగాళాఖాతం ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని నేరుగా తాకింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల/సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని వాయుసేన సాధించింది.

ట్యాగ్స్​