కేంద్ర మంత్రి ట్విట్టర్​ ఖాతా హ్యాక్​

By udayam on January 12th / 6:29 am IST

కేంద్ర ఇన్ఫర్మేషన్​, బ్రాడ్​క్యాస్టింగ్​ మంత్రి అనురాగ్​ సింగ్​ ఠాకూర్​ ట్విట్టర్​ ఖాతా బుధవారం హ్యాక్​ అయింది. ఈ ఖాతా పేరును హ్యాకర్లు ‘ఎలన్​ మస్క్​’గా మార్చి ‘గ్రేట్​ జాబ్​’ అంటూ ట్వీట్ చేశారు. కొద్దిసేపు హ్యాకర్ల చేతిలో ఉన్న ఈ అకౌంట్​ను తిరిగి ట్విట్టర్​ పునరుద్ధరించింది. హ్యాకర్లు చేసిన ట్వీట్లను సైతం ట్విట్టర్​ డిలీట్​ చేసింది. గతేడాది డిసెంబర్​ 12న ప్రధాని నరేంద్ర మోదీ ఖాతా సైతం హ్యాకర్ల బారిన పడ్డ సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​