క్రికెట్​లో వినూత్న మార్పులకు ఐసీసీ గ్రీన్​సిగ్నల్​

By udayam on September 20th / 12:35 pm IST

క్రికెట్​ రూల్స్​లో కీలక మార్పులకు ఐసిసి మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఇకపై బ్యాటర్​ క్యాచ్​ ఔట్​ అయినప్పుడు వచ్చే కొత్త బ్యాటర్​ స్ట్రైకర్​ స్థానంలోకే రావాల్సి ఉంటుంది. బాల్​కు ఉమ్మి రాయడంపై ఇకపై శాశ్వత నిషేధం విధించింది. బౌలింగ్​ వేసే సమయంలో ఫీల్డింగ్​లో కదలికలు ఉంటే దానిని డెడ్​బాల్​గా పరిగణిస్తారు. ఆపై బ్యాటింగ్​ జట్టుకు 5 పెనాల్టీ రన్స్​ కూడా అంపైర్​ ఇస్తారు. మన్కడింగ్​ను ఇకపై రనౌట్​ గానే చూస్తారు. 2023 వన్డే వరల్డ్​ కప్​ అనంతరం వన్డేల్లోనూ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే మిగిలిన ఓవర్లలో బౌడరీ దగ్గర కేవలం నలుగురిని మాత్రమే ఫీల్డింగ్​కు ఉంచుతారు.

ట్యాగ్స్​