అంతర్జాతీయ క్రికెట్లోకి 15 ఏళ్ళ లోపు వారు వద్దు

కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన ఐసిసి

By udayam on November 20th / 8:15 am IST

అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి ఇకపై కనీసం 15 ఏళ్ళ వయసు నిండాలని అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసిసి) కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

ఈ కొత్త వయసు నిబంధన పురుషులు, స్త్రీలు, అండర్​–19 క్రికెట్లో అమలులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు ఎలాంటి వయసు నిబంధన లేకుండా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉండేది.

అయితే ఇలా ఇప్పటి వరకూ కేవలం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లోకి 15 ఏళ్ళ లోపు అరంగేట్రం చేశారని ఐసిసి తెలిపింది. పాకిస్థాన్​కు చెందిన హసన్​ రాజ, రోమేనియాకు చెందిన గెరాసిమ్​, కువైట్​కు చెందిన బావ్సర్​లు 14 ఏళ్ళ వయసులోనే క్రికెట్లోకి అరంగేట్రం చేశారు.