క్రికెట్లో తిరిగి న్యూట్రల్ అంపైర్ల (మ్యాచ్లు ఆడే దేశాలకు చెందని అంపైర్లు) విధానాన్ని ఐసిసి ప్రవేశపెట్టింది. కొవిడ్–19 తర్వాత ఎక్కడైతే మ్యాచ్లు జరుగుతాయో ఆ దేశానికి సంబంధించిన అంపైర్లనే ఇప్పటి వరకూ ఐసిసి కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు కొవిడ్ చివరి దశకు రావడంతో న్యూట్రల్ అంపైరింగ్ పద్దతిని తిరిగి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని ఐసిసి ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే వెల్లడించారు. ఈ నిర్ణయంతో మ్యాచ్లు మరింత పారదర్శకంగా ఉంటాయని తెలిపారు.