ఐసిసి మహిళల టి20 షెడ్యూల్​ వచ్చేసింది

By udayam on October 4th / 5:24 am IST

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న మహిళల టి20 వరల్డ్​ కప్​ కు సంబంధించి షెడ్యూల్ను ఐసిసి విడుదల చేసింది. భారత్​ను గ్రూప్​ 2 లో ఉంచిన ఐసిసి అందులో పాకిస్థాన్​, ఇంగ్లాండ్​, వెస్టిండీస్​, ఐర్లాండ్​ జట్లకు చోటిచ్చింది. గ్రూప్​ 1 లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్​, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్​ జట్లు తలపడనున్నాయి. సౌతాఫ్రికా వేదికగా జరిగే ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​ ఫిబ్రవరి 10న సౌతాఫ్రికా–శ్రీలంక జట్ల మధ్​య జరుగుతుంది. ఫైనల్​ ఫిబ్రవరి 26న వర్షం వస్తే 27న జరుగుతుంది.

 

ట్యాగ్స్​