వడ్డీ రేట్లు పెంచిన ఐసిఐసిఐ

By udayam on May 26th / 7:46 am IST

దేశంలోని 2వ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్​ ఐసిఐసిఐ తన ఖాతాదారుల ఫిక్స్​డ్​ డిపాజిట్లకు వడ్డీ రేట్లను మళ్ళీ పెంచింది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ చేసే ఎఫ్​డిలపై 29 రోజులకు 3 శాతం, 30–60 రోజులకు 3.25, 61–90 రోజుల మధ్య 3.40, 91–184 రోజుల ఎఫ్​డిలకు రూ.4.25 శాతం ఫిక్స్​ చేసింది. 185–270 రోజుల మధ్య వడ్డీని 4.50 శాతానికి, 271–365 రోజులకు 4.70 శాతం, 365–389 మధ్య 4.95 శాతం, 15–18 నెలల మధ్య 5 శాతం, ఆపై 10 ఏళ్ళ వరకూ 5.25 శాతం వడ్డీ రేటును ఫిక్స్​ చేసింది.

ట్యాగ్స్​