తెలంగాణ: ప్రభుత్వ స్కూల్స్​ లో​ విద్యార్థులకు ఐడీ కార్డులు

By udayam on December 26th / 8:02 am IST

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలుపబోతుంది రాష్ట్ర సర్కార్. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, ఐడి కార్డు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వీటికోసం దాదాపు 300 కోట్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం.. ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అన్నీ ఓకే అయితే వచ్చే సంవత్సరం నుంచి, ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.

ట్యాగ్స్​