ఇడుపులపాయ: గుండెపోటుతో కన్నుమూసిన ట్రిపుల్​ ఐటి స్టూడెంట్​

By udayam on December 5th / 10:13 am IST

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతున్న వెంకట సాయి శంకర్‌ (21) ఈరోజు గుండెపోటుతో కన్నుమూశాడు. వ్యాయామం చేసి హాస్టల్‌ కు తిరిగి వస్తుండగా శంకర్‌ కు గుండె నొప్పి రావడంతో ఇడుపులపాయలోని ఆసుపత్రికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. వెంటనే అంబులెన్స్‌ లో కడపకు తరలిస్తుండగా నందిమండలం వద్దకు రాగానే శంకర్‌ పల్స్‌పడిపోయింది. దీంతో అంబులెన్స్‌ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించగా, అప్పటికే విద్యార్థి మృతి వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్​