2022వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా భారతీయుల్లో చాలా మందికి ఇప్పటికీ కొడుకే పుట్టాలన్న కోరిక బలంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది తమకు కనీసం ఒక కొడుకైనా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. శతాబ్దాల తరబడి భారత సమాజంలో ఇంట్లో కనీసం ఒక మగ పిల్లవాడైనా ఉండాలని కోరుకోవడం సెంటిమెంట్. అయితే అదే సమయంలో దేశ లింగ నిష్ఫత్తిలో గణనీయమైన పెరుగుదల కనిపించడం కాస్త సంతోషకరం.