పాపులర్ ఫర్నీచర్ సంస్థ ఐకియా భారత్‌లో 7 వేల మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ఐకియా స్టోర్‌ను ఈరోజు బెంగళూరులో ప్రారంభించిన ఆ సంస్థకు ఇప్పటి వరకూ భారత్‌లో హైదరాబాద్‌లో ఒకటి, ముంబైలో 2 స్టోర్స్‌తో కలిపి కలిపి మొత్తం 4 స్టోర్స్ ఉన్నాయి. ముందుగా 1000 మందిని అందులో 700ల మందిని స్థానికులకే అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 3 వేల మంది ఉద్యోగులు తమ సంస్థలో ఉన్నారన్న ఐకియా.. దీనిని 10 వేలకు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.