విశాఖ గీతం యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత.. పార్క్​ చుట్టూ కంచె

By udayam on January 6th / 5:26 am IST

విశాఖపట్నం గీతం వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమిలి ఆర్డీవో, విశాఖ డీఆర్వో పర్యవేక్షణలో మైదానం చుట్టూ పోలీసు సిబ్బంది ఇనుపకంచె ఏర్పాటు చేశారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారం, వైద్య కళాశాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టారు. డిసిపి స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. భీమిలి ఆర్డీవో భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ … కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్​