రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోని శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గడ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, గుమ్మడిదల వద్ద గంట పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. కడపలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో కురిసిన వానలకు పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.