దేశంలో వచ్చే వారం రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్‌లతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత తగ్గుతుందని పేర్కొంది. అదే సమయంలో వాయువ్య భారతంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ లు జారీ చేసినట్లు చెప్పిన వాతావరణ శాఖ దేశ రాజధాని ఢిల్లీలోనూ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.