బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారిందని తెలిపారు. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.