ప్రధాని కారునూ ఉంచేసుకున్న ఇమ్రాన్​ ఖాన్​

By udayam on May 3rd / 10:37 am IST

పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్.. పాక్​ ప్రభుత్వానికి చెందిన కార్ ను తనతో పాటు తీసుకెళ్లిపోయారని ఆ దేశ ఐటి మంత్రి మరియం ఆరోపించారు. మన కరెన్సీలో రూ.6.19 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్​5 కారును ప్రధాని కార్యాలయానికి టాగ్​ చేయాల్సి ఉండగా.. ఇమ్రాన్​ ఆ పని చేయలేదని, ఇప్పటికీ ఆ కారును తన వద్దనే ఉంచుకున్నాడని మరియం విమర్శించారు. పాక్​ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన ఖరీదైన వజ్రాభరణాలను దుబాయ్​లో అమ్ముకున్నాడని సైతం ఇమ్రాన్​పై గతంలో ఆరోపణలు వచ్చాయి.

ట్యాగ్స్​