గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వైద్య విద్యార్థిని విస్మయ (22) ఆత్మహత్య కేసులో కేరళలోని కొల్లం న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. విస్మయను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన భర్త కిరణ్ కుమార్ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి 10 ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ.12.55 లక్షల జరిమానా విధించింది. పెళ్లికి ఇచ్చిన కట్నం చాలలేదంటూ కిరణ్ ఆమెను చిత్రహింసలు పెట్టడంతో ఆమె 2021 జూన్ 20న ఆత్మహత్య చేసుకుంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.