గత ఐదేళ్లలో కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ చేసినట్టు ఆర్‌బిఐ ఆర్టీఐ సమాధానంగా వెల్లడించింది. ఈ మొత్తం గడిచిన 10 ఏళ్ళలో 13 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పిటిషన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సమాధానమిచ్చింది. గత ఐదేళ్లలో రూ.10,09,510 ఓట్లు ఎన్‌పీఏ కింద బ్యాంకులు మాఫీ చేశాయని తెలిపింది. అందులో రూ.1,32,036 కోట్ల (13శాతం) రుణాలు మాత్రమే బ్యాంకులు వసూలు చేసినట్టు తెలిపింది. 2022-23 నాటికి అంచనా వేసిన స్థూల ఆర్థిక లోటు రూ.16.61 లక్షల కోట్లలో 61శాతం రుణమాఫీ అవుతుందని అంచనా వేశామనీ, మార్చి 2022 నాటికి ఎన్‌పిఎలు రూ.7,29,388 కోట్లకు తగ్గించిందని ఆర్‌బిఐ వెల్లడించింది.