ఢిల్లీ శ్రద్ధా వాకర్ దారుణ హత్య కేసులో పోలీసులు మరిన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్ లు గొడవ పడుతున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సంపాదించారు. ఇది ఈ కేసులో కీలక ఆధారంగా మారుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ దారుణ హత్యకు ముందు అతడి ప్రవర్తన ఎలా ఉండేది అన్నది ఈ ఆడియో క్లిప్ తో ప్రూవ్ చేయగలమని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ కేసు ను మరింత బలంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి పోలీసులకు వీలవ్వనుంది.