రెండు దురదృష్టకర సంఘటనలతో టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే తరహా మరో ఘటనకు చోటు ఇవ్వరాదన్న ఉద్దేశ్యంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దురుసు ప్రవర్తనతో కూడిన ప్రయాణికుల గురించి వెంటనే సమాచారం అందించాలంటూ క్యాబిన్ క్రూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ప్రయాణికుడు, ప్రయాణికులతో తోటి ప్రయాణికులకు రిస్క్ ఉంటుందని భావిస్తే వారి ప్రయాణానికి నిరాకరించాలని డ్యూటీ మేనేజర్, స్టేషన్ మేనేజర్ కు సూచించింది.