దేవాలయాలు, మతాల నమ్మకాలతో భారత్‌లో ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ 2021 రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛపై జరిపిన ఈ సర్వేలో పలు దేశాల్లోని పరిస్థితులనూ కళ్ళకు కట్టింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో భక్తి పేరిట దాడులు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి’ అని ఈ రిపోర్ట్‌లో వెల్లడించింది. వియత్నాం, నైజీరియా, సౌదీ అరేబియా, చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లలోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది.