IND vs AUS : భారత బౌలర్లను ఉతికారేసిన ఆసీస్​

By udayam on September 21st / 5:57 am IST

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిన్న జరిగిన తొలి టి20 మ్యాచ్​లో ఆసీస్​ ఘన విజయం సాధించింది. భారత్​ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా ఏ దశలోనూ బెదరలేదు. భారత బౌలింగ్​ను ఊచకోత కోస్తూ.. ఆసీస్​ బ్యాటర్లు కామెరూన్​ గ్రీన్​ 61, మాథ్యూ వేడ్​ 45, స్మిత్​ 35 పరుగులు బాదేశారు. దీంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్​ విజయాన్ని అందుకుని సిరీస్​లో 1–0 తో ముందంజలో ఉంది. అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన భారత్​కు రాహుల్​ 55, సూర్యకుమార్​ 46, హార్ధిక్​ పాండ్య 71 పరుగులు చేశారు.

 

ట్యాగ్స్​