ఎంపీ సూసైడ్ !

By udayam on February 23rd / 7:44 am IST

న్యూఢిల్లీ : వాళ్ళు వీళ్ళు అని లేదు వింతగా ఈ మధ్య ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఆత్మహత్యకు దిగుతున్నారు. తాజాగా దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ (58) సోమవారం ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది.

అయితే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తమై పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు.

ట్యాగ్స్​