దేశంలో కరోనా కేసుల సంఖ్య 4 వేలను దాటి ప్రమాద ఘంటికల్ని గట్టిగానే మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4.25 లక్షల మంది పరీక్షలు జరపగా అందులో 4,041 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 84 రోజుల తర్వాత భారత్‌లో ఒకరోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. గురువారం నాడు ఈ సంఖ్య 3,712గా ఉంది. కేరళలో 1370, మహారాష్ట్రలో 1045 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,177గా ఉంది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/eVGpM8td6y pic.twitter.com/ykoU5DV6Y4
— Ministry of Health (@MoHFW_INDIA) June 3, 2022