పాక్​ ప్రధాని విమానానికి భారత్​ అనుమతి

By udayam on February 23rd / 8:11 am IST

ఈరోజు శ్రీలంక పర్యటనకు బయల్దేరనున్న పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ప్రయాణించే విమానం మన ఎయిర్​స్పేస్​లో ప్రయాణించడానికి భారత ఏవియేషన్​ శాఖ అనుమతులు మంజూరు చేసింది.

ఇమ్రాన్​ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు శ్రీలంక బయల్దేరనున్నారు. ఈ విమానంలో ఇమ్రాన్​తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మొమహ్మద్​ ఖురేషితో పాటు పలువురు అధికారులు ఉండనున్నారు.

అయితే శ్రీలంక పర్యటనలో ఆయన ఆ దేశ పార్లమెంట్​లో చేయాల్సిన ప్రసంగాన్ని శ్రీలంక రద్దు చేసింది. అక్కడ కూడా ఆయన కాశ్మీర్​ అంశాన్ని లేవనెత్తి భారత్​పై లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడతారనే ఉద్దేశ్యంతోనే శ్రీలంక ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​
Source: timesnownews