5:03 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ఎసిల దిగుమతిపై నిషేధం.. చైనాకు మరో ఝలక్ ఇచ్చిన కేంద్రం 2 weeks ago

న్యూఢిల్లీ: పైకి ఒకటి చెబుతూ చేతల్లో మరొకటి చూపిస్తూ వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణకు దిగుతున్న చైనాకు కేంద్రం తన చర్యలతో వరుస షాకులు ఇస్తోంది. ఇప్పటికే చైనా యాప్​లను, మరికొన్ని వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం తాజా రిఫ్రిజిరెంట్స్‌తో కూడిన ఎయిర్ కండిషనర్ల దిగుమతుల ను బాన్ చేసింది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం, రిఫ్రిజిరెంట్స్‌తో కూడిన ఎయిర్ కండిషనర్లు, స్ప్లిట్ ఏసీ సిస్టమ్స్ దిగుమతిపై నిషేధం విధించారు. వీటిని ‘‘ఫ్రీ’’ కేటగిరీ నుంచి ‘‘ప్రొహిబిటెడ్’’ కేటగిరీలోకి మార్చారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆమోదం తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ అయింది.   దీనివల్ల చైనాకు ఎదురు దెబ్బ తగలడంతోపాటు భారత దేశ పారిశ్రామిక రంగానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్‌ పథకానికి అనుగుణంగా స్థానిక తయారీదారులు ఏసీల ఉత్పత్తి ఇకపై స్థానికంగానే చేయాల్సి ఉంటుంది.